తిరుపతి: డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కోసం పాదయాత్ర

55చూసినవారు
డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కోసం కదిరి పట్టణానికి చెందిన పవన్ కళ్యాణ్ బుధవారం తిరుపతి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తనకు లారెన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయనను కలవడానికి చెన్నైకి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అలిపిరి మెట్ల వద్ద వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. గతంలో హైదరాబాద్ నుంచి కదిరికి సైకిల్ యాత్ర కూడా చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్