సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.