వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు తిరుపతి జేఈవో ఎం. గౌతమి సూచించారు. తిరుపతి పరిపాలన భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు.