వెంకటగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీలకంఠేశ్వరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే గ్రామాల్లో చేయాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మండలం లోని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు హాజరుకావాలని పేర్కొన్నారు.