వెంకటగిరి మండలం పెట్లూరు పంచాయతీ పరిధిలోని 10 మంది, పాపమాంబపురం పంచాయతీ పరిధిలో ముగ్గురు వలంటీర్లు రాజీ నామా చేసినట్లు ఎంపీడీవో నీలకంఠ రెడ్డి మంగళవారం తెలిపారు. అలాగే డక్కిలి సచివాలయ పరిధిలో పనిచేస్తున్న నలుగురు వలంటీర్లు రాజీనామా చేశారు. వలంటీర్లు మునికృష్ణారెడ్డి, ప్రసన్న కుమార్, వెంకయ్య బాబు, సుగుణమ్మ తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అనురాధాకు అందజేశారు.