ఆడబిడ్డలను టచ్‌ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలి: CM చంద్రబాబు

68చూసినవారు
ఆడబిడ్డలను టచ్‌ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలి: CM చంద్రబాబు
AP: ఆడబిడ్డలను టచ్‌ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనలపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. యువతి హత్య, అత్యాచారం కేసుల్లో వేగంగా విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. పక్కాగా ఆధారాలు సేకరించి కఠిన శిక్షలు పడేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్యాప్తు, చర్యల వివరాలను డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

సంబంధిత పోస్ట్