కుండపోత వర్షాలు, వరదలకు రాష్ట్రం వణికిపోతుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించాయి. తొలత ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ఇవ్వగా.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.