తెలుగు రాష్ట్రాల మహిళలందరూ ఇవాళ వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి.