మారోజు వీరన్న PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో విద్యార్థుల సమస్యలపై విద్యార్థి ఉద్యమాలు నడిపి, PDSU వీరన్నగా పేరుపొందారు. CPI (ML) విమోచన పార్టీలో రాష్ట్ర నాయకుడిగా, సిద్ధాంతకర్తగా ఎదిగారు. ఆ తర్వాత CPI (ML) జనశక్తి పార్టీలో సిద్ధాంత పోరాటం కొనసాగించారు. 1995 మే 17 నుంచి 1998 వరకు జనశక్తి పార్టీని దళిత బహుజన కమ్యూనిస్టు పార్టీగా మార్చేందుకు అంతర్గత పోరాటం చేశారు.