AP: రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని, త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ-లెట్ బోర్డు పెట్టబోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు అరాచకాలు చేసిన వైసీపీ నేతలు ఇవాళ నీతులు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.