ఏపీలో ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర

83చూసినవారు
ఏపీలో ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
ఏపీలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. మూడు రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.80 నుంచి 100 పలికింది. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. టమాటా ధరలు తగ్గడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేసినా పండిస్తున్న రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్