ఏపీలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావం ఉండటంతో రేపు (శుక్రవారం) స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ సృజన ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.