అమరావతిలోని ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై సీఎం సూచనలు చేశారు. హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టుల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం సమన్వయంతో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేశ్, అధికారులు హాజరయ్యారు.