AP: విశాఖ జిల్లా నక్కపల్లిలోని హెటిరో ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో విష వాయువు విడుదలైంది. దాంతో 12 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మందిని నక్కపల్లి ఆస్పత్రికి, ముగ్గురిని తుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.