మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్మదాపురంలోని కొండర్వాడ-బచ్వారా రహదారిపై ఓ ట్రాక్టర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఘటనలో నలుగురు కార్మికులు ట్రాక్టర్ కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ స్టీరింగ్ ఫెయిల్ వల్ల ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.