ఒలింపిక్ పతకం విజేత, బాక్సర్ విజేందర్ సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మహిపాల్ సింగ్ గురువారం కన్నుమూశారు. కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బాక్సింగ్ తరపున విజేందర్ తొలి ఒలింపిక్ పతకం సాధించారు. ప్రస్తుతం ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.