AP: తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీలత అనే మహిళ కుమారుడితో కలిసి తాను పని చేస్తున్న దుకాణానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి కళ్ల ముందే తల్లి శ్రీలత చనిపోయింది. సమాచారం అందుకున్న శ్రీలత భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.