దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం పహాడ్‌గంజ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ముగ్గురు చిక్కుకుపోయినట్లు గుర్తించి వారిని వెలికితీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.