నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. క్షేత్రంలోని మహానందిసదనంలో వసతి గృహాం కూల్చివేసే క్రమంలో ఇద్దరు కూలీలు మరణించారు. వసతి గృహాన్ని పడగొట్టే సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు నేరుగా కూలీలపై పడడంతో వారికి తీవ్రగాయాలై మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.