పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది: త్రిష (VIDEO)

73చూసినవారు
అండర్-19 ఉమెన్స్ WCలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం లభించినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇకపై మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. తన ప్రతి విజయంలో నాన్న ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్