కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హోస్పేట్ సమీపంలోని తిమ్లపుర టోల్ బూత్‌ను అతివేగంగా వచ్చిన ట్రక్కు బుధవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.