దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం వరకు లాభాల్లోనే కొనసాగాయి. ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1450 పాయింట్లు లాభపడి 78,413.68 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 378.20 పాయింట్ల లాభంతో 23,739.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.07గా ఉంది.