ట్రంప్ యంత్రాంగం గాజాలోని 10 లక్షల పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు తరలించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు లిబియాకు సంబంధించిన నాయకులతో ట్రంప్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. లిబియా ఈ ప్రతిపాదన అంగీకరిస్తే, అమెరికా బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయనుందని తెలిసింది. కాగా, ట్రంప్ వ్యూహంతో అక్కడి ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.