స్థానిక, ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త

61చూసినవారు
స్థానిక, ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త
AP: స్థానిక (తిరుపతి), ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 11న తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్థానికులకు 9వ తేదీ (నేడు) తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు నందు ఈ టోకెన్లు ఇవ్వనున్నారు. ఇక, తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయులకు ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. గతంలో రోజుకు 50 మంది NRIలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్