తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఈ నెల 24న టీటీడీ రిలీజ్ చేయనుంది. ఆరోజే దర్శనం టోకెన్లు ఉదయం 10 గంటలకు, మ.3 గంటలకు గదుల కోటాను విడుదల చేయనుంది. అలాగే ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రిలీజ్ చేయనుంది.