అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య

53చూసినవారు
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య
AP: కడప జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. దేవన కొండకు చెందిన లక్ష్మన్న అనే రైతు అప్పుల బాధతో పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే గోనెగండ్ల మండలంలో రామాంజనేయులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతుల మరణంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్