నంద్యాల జిల్లాలో ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బనగానపల్లె మండలం జిల్లెలకు చెందిన కల్పన (15), కీర్తి (18) టెన్త్, ఇంటర్ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్కూల్, కాలేజీకి వెళ్లినా బాలికలు తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.