AP: అల్లూరి ఏజన్సీలో విషాద ఘటన చోటుచేసుకున్నది. హుకుంపేట మండలం టిటింగి వలస వద్ద ఆటో - బైక్ ఢీ కొన్నాయి. పాడేరు మోద కొండమ్మ జాతరకు వెళ్లి బైక్ వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.