AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.