అమెరికాలోని సియాటెల్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీ కొంది. ఈ ఘటనలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం తోక భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాద సమయంలో జపాన్ విమానంలో 185 మంది, డెల్టాలో 142 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రెండు విమానాల్లోని ప్రయాణికులను సురక్షితంగా దించివేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.