స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి (వీడియో)

66చూసినవారు
AP: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెళ్లింది. తల్లితో పాటు చిన్న కొడుకు శ్రీదీక్షిత్ (2) కూడా వచ్చాడు. అయితే ప్రమాదవశాత్తూ శ్రీదీక్షిత్ బస్సు టైరు కింద పడి మృతి చెందాడు. శ్రీదీక్షిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్