ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయా? కీలక వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీకి జై కొట్టనున్నారా? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఎంపీ తను నిబద్ధతంగా వైసీపీలోనే ఉండిపోతానని చెప్పుకొచ్చారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఆ మరుసటి రోజే ఆయన బీజేపీ పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఇక రాయలసీమకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఒకరు పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.