దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని కారణంగా వాటికి నోటీసులిచ్చింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన మూడు, తెలంగాణకు చెందిన ఒక కాలేజీ ఉన్నాయి. ఏపీ నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజ్ (విశాఖ), గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ ఉండగా.. తెలంగాణ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండటం గమనార్హం.