వైఎస్ జగన్ కు మరో భారీ షాక్ తగలనుందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‍లో వైరల్‍గా మారింది. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో.. ఐదుగురు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచిన వారని సమాచారం. ఎమ్మెల్యేగా గెలిచినా.. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనలేని పరిస్థితి వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసి.. అసెంబ్లీకి వెళ్లాలని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.