వారానికి 70 గంటలు పని విధానంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోన్న వేళ కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో పని గంటల పెంపుపై సభ్యులు చర్చ చేపట్టగా కేంద్రం సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వారానికి పని గంటలను 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని వెల్లడించారు.