భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం కటక్ వేదికగా రెండో వన్డే జరగనుంది. మోకాలి నొప్పి వల్ల తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ఈ మేరకు కోహ్లీ ఫిట్‌నెస్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ ఫిట్‌గా ఉన్నట్టు వెల్లడించారు. ‘విరాట్ కోహ్లీ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడు. అతను ప్రాక్టీస్ కోసం వచ్చాడు. బాగా సన్నద్ధమయ్యాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.