నాపై అగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయి: తీన్మార్ మల్లన్న

74చూసినవారు
నాపై అగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయి: తీన్మార్ మల్లన్న
MLC తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంతో TPCC క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై మల్లన్న స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. నోటీసులు వస్తే సమాధానం ఇస్తానని మల్లన్న స్పష్టం చేశారు. తనకు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తానని అన్నారు. అయితే, తనపై అగ్రవర్ణాలు కావాలనే కుట్రచేస్తున్నాయని మల్లన్న వెల్లడించారు.

సంబంధిత పోస్ట్