దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 దేశాల సమావేశానికి అమెరికా తరపున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో తెలిపాడు. ఈనెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. అమెరికా గైర్హాజరు జీ-20 కూటమికి పెద్ద దెబ్బే.