ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన ఆర్.వైశాలి కాంస్యం కైవసం చేసుకుంది. 2025, జనవరి 1న జరిగిన సెమీస్‌లో 0.5-2.5తో జు వెన్జున్ (చైనా) చేతిలో ఓడింది. ఫైనల్లో వెన్జున్ 3.5-2.5తో లీ టింగ్జీ (చైనా)పై నెగ్గి విజేతగా నిలిచింది. 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన వైశాలి.. 2018లో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ఘనత సాధించింది.