అటల్ బిహారీ వాజపేయి ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లం, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రులయ్యారు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎంఏ పట్టాను కాన్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి పొందారు. ఎంఏ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.