ముగిసిన వల్లభనేని వంశీ పోలీసు విచారణ

74చూసినవారు
ముగిసిన వల్లభనేని వంశీ పోలీసు విచారణ
AP విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. పోలీసులు సుమారు 8 గంటల పాటు వంశీని విచారించారు. ప్రస్తుతం కృష్ణలంక పీఎస్ నుంచి జీజీహెచ్‌కు ఆయనను తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టులో వంశీకి రిమాండ్‌ విధించాలని పోలీసులు జడ్జిని కోరనున్నారు. రిమాండ్‌ విధిస్తే వంశీని జైలుకు తరలించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్