టార్గెట్ చేసి వంశీని అరెస్ట్ చేశారు: వైసీపీ

72చూసినవారు
టార్గెట్ చేసి వంశీని అరెస్ట్ చేశారు: వైసీపీ
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరిగిందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని గురువారం ట్వీట్ చేసింది. కానీ వంశీని కూటమి నేతలు టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించింది.

సంబంధిత పోస్ట్