AP: చంద్రబాబు సర్కార్ రైతు బజార్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కూలర్లలో కూరగాయలు, ఆకు కూరలను 3-5 రోజుల పాటు, బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి వంటివి వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఒక్కో సబ్జీ కూలర్ ధర రూ.27 లక్షలు ఉంటుంది. కూలర్‌పై 50 శాతం ఉద్యాన శాఖ సబ్సిడీ ఇవ్వనుండగా.. మిగతా 50 శాతం స్టాల్స్ నిర్వాహకులు భరించాలి.