AP: సీఎం చంద్రబాబు జలవనరుల శాఖపై శనివారం సమీక్షించారు. 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం 419 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయని ఆయన అన్నారు.