విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నటుడు విక్టరీ వెంకటేష్ ఇవాళ 3000 మంది అభిమానులతో ఫొటోలు దిగారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.