కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిని తాత్కాలికంగా విజయవాడలోని విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నెయ్యి సరఫరా చేస్తున్న టెండరుదారు రైతు డెయిరీ గడువు సెప్టెంబరు 30తో ముగిసింది. అయితే ప్రస్తుతం ఆలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతపై చర్చ జరుగుతోంది. మరోవైపు నెయ్యి కొనుగోలుపై దేవాదాయశాఖ నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు.