VIDEO: మహిళలతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు!

83చూసినవారు
బీహార్‌‌లోని గయలో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి తిలక్ వేడుకలో ఒక వ్యక్తిని కాల్చి చంపారు. వేదికపై డాన్స్ చేస్తున్న మహిళలకు డబ్బు ఇస్తుండగా అతనిపై బుల్లెట్లు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. 27 ఏళ్ల వ్యక్తి తలకు బుల్లెట్ తగిలడంతో వేదికపైనే అతను మృతి చెందాడు. రాజకీయ శత్రుత్వం కారణంతోనే అతడ్ని చంపారని మృతుడి కుటుంబం ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్