VIDEO: పేలిన వంట గ్యాస్ సిలిండర్.. నలుగురు చిన్నారులు మృతి

75చూసినవారు
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. రామాపూర్ గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చేలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు. మృతులను విపుల్ కుమార్ (5), కుమారి (8), హన్షికా కుమారి (3), శ్రుష్టి కుమారి (4)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్