VIDEO: ఓటు వేసిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్

76చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ సమయ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటు వేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఎంతో ఆశతో చూస్తున్నారని నాకు నమ్మకం ఉందని దేవేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్