శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి ప్రవేశించింది. దీంతో తన కూతుళ్లు, బంధువులతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శ్రీనివాస్ భార్య వాణి సిద్ధమైంది. దీంతో పోలీసులకు, వాణి బంధువులకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ సీన్ మొత్తాన్ని దువ్వాడ శ్రీను ఇంటి పైనుంచి సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది మాధురి.